ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.
భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల
వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.
భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.
బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు.
దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.
బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు
బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.
బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.
ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది..
తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని,ఆ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.
ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు.
అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమర్పణ
శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను.”
నీతి:
పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.
మనము కూడా మన చిత్తములని ఆ చిత్త చోరునికి సమర్పిద్దాము.
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...